చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అలాగే, ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని దుమ్ము, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.