కాఫీకి బదులుగా ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచి, క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును నివారిస్తుంది. ఇందులోని కాటెచిన్స్ పళ్లు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడును చురుకుగా ఉంచి ఏకాగ్రతను పెంచుతాయి. అయితే, రోజుకు 2 కప్పులు తాగాలి.