శరీర భాగాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద చెవులు ఉన్నవారు ఆత్మవిశ్వాసం, నిజాయితీ కలిగి ఉండి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని వివరిస్తున్నారు. చిన్న చెవులు ఉన్నవారు లోతైన ఆలోచనాపరులై, క్రమశిక్షణతో లక్ష్యం వైపు దూసుకుపోతారని అంటున్నారు. ఇలా చెవుల ఆకృతిని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
జీలకర్ర జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి, ఆ కషాయాన్ని తాగితే కడుపులో గ్యాస్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా అవసరం. వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది.
మిరియాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు అత్యుత్తమ మందు. మిరియాల పొడిని నెయ్యితో లేదా తేనెతో తీసుకుంటే మొండి దగ్గు, గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతాయి. ఇందులో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. మిరియాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తలనొప్పి ఉన్నప్పుడు మిరియాల కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది.
కడుపు నొప్పి లేదా అజీర్తితో బాధపడుతున్నప్పుడు వామును మించిన మందు మరొకటి లేదు. అర చెంచా వామును కొంచెం ఉప్పుతో కలిపి నమిలి గోరువెచ్చని నీరు తాగితే ఐదు నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు వాము నీటిని ఇస్తే చాలా మంచిది. వాము ఆస్తమా రోగులకు కూడా మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు వాము నూనెతో మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
మామిడి పండ్లు తింటే షుగర్ పెరగడం పక్కన పెడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు సరైన పద్ధతిలో మామిడి తింటే అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. రోజుకు 250 గ్రాముల కంటే ఎక్కువ మామిడి పండును తీసుకోకూడదు. బిర్యానీలు లేదా స్వీట్లు తిన్న తర్వాత మామిడి పండు తింటే మాత్రం షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.
లిప్‌స్టిక్ వాడకం నేటి ట్రెండ్‌లో భాగమైనప్పటికీ, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని సీసం, కాడ్మియం వంటి భారలోహాలు దీర్ఘకాలంలో శరీరంలో చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రసాయనాలు లేని ఆర్గానిక్ లేదా నాన్-టాక్సిక్ ఉత్పత్తులనే ఎంచుకోవడం ఉత్తమం.
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పౌష్టికాహారం, టీకాలు ఇస్తూనే వారిని గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచి శారీరక ఆటలను ప్రోత్సహించాలి. ప్రతిరోజూ వారితో సమయం గడుపుతూ, వారి భావాలకు గౌరవం ఇవ్వాలి. ప్రేమ, క్రమశిక్షణల మధ్య సమతుల్యత పాటిస్తూ, అపరిచితుల పట్ల జాగ్రత్తలు నేర్పాలి. ఒత్తిడి లేని వాతావరణంలో పెంచుతూ వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.
భోజనం తర్వాత సిగరెట్ తాగడం సాధారణ సమయం కంటే 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ అలవాటు జీర్ణక్రియను దెబ్బతీసి, ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎసిడిటీ, అల్సర్లు, తీవ్రమైన గుండెల్లో మంట ఏర్పడతాయి. ముఖ్యంగా నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్యం కోసం ఈ ప్రాణాంతక అలవాటును వెంటనే మానేయడం ఉత్తమం.
మొటిమల సమస్యతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్ నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు వంటివి తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, కొబ్బరినీళ్లు, తగినంత నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. సరైన పోషకాహారంతో ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
సాధారణంగా ఎవరినైనా అభినందించడానికి, ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాం. కానీ, చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీన్నే క్లాపింగ్ థెరపీ అని కూడా అంటారు. చప్పట్లతో శరీర భాగాలకు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవుతాయి. దీంతో వెన్ను నొప్పి, ఒత్తిడి, ఆందోళ, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించడంలోనూ ఇవి కీలకం. వీటిని పొడి రూపంలో రోజూ తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ప్రకాశవంతంగా మారుతాయి.
దానిమ్మ పండు పోషకాల గని. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం డిటాక్స్ అవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది.
వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ‘సిమ్ బైండింగ్’ నియమాలను అమలు చేయడానికి రేపటి వరకే గడువు ఇచ్చింది. కొత్త నిబంధనల మేరకు మీ ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, తదితర మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. మీరు మీ కంప్యూటర్‌లో వాట్సాప్‌లోకి లాగిన్ అయితే 6 గంటల్లోపు లాగ్ అవుట్ అవుతుంది.