• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కళ్లజోడు మచ్చలు తగ్గించే చిట్కాలు

నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్‌ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ తొక్కల పొడిలో పాలు లేదా పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకుని కొంతసేపటికి క్లీన్ చేస్తే బెటర్.

March 3, 2026 / 10:56 AM IST

బేక్‌ఫాస్ట్‌ స్కిప్ చేస్తున్నారా?

బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. కానీ, ఉదయం అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి అందక నీరసం వస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడమే కాకుండా, మధ్యాహ్నం అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడు చురుకుదనం తగ్గుతుంది. అలాగే మెటబాలిజం మందగిస్తుంది.

March 3, 2026 / 09:30 AM IST

విదుర నీతి: వీరి సలహాలు అస్సలు తీసుకోకండి

ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నలుగురి సలహాలు తీసుకోకూడదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పారు. వివేకం లేని అల్పబుద్ధి కలవాడు, బాధ్యత లేని సోమరి, పనులను సాగదీసే దీర్ఘసూత్రుడు, కేవలం సంతోషపెట్టడానికే అబద్ధాలు చెప్పే ముఖస్తుతి పరుడు.. వీరి వల్ల పనులు పూర్తికాకపోగా అనర్థాలు జరుగుతాయని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని విదుర నీతి సారాంశం.

March 3, 2026 / 08:00 AM IST

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే చాలు

నానబెట్టిన గుప్పెడు పల్లీలు, ఒక అరటిపండు, కప్పు పాలు, తేనే కలిపి జ్యూస్‌లా తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలను నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమై, శరీరానికి ప్రోటీన్‌ను అందిస్తాయి. అరటిపండులోని పొటాషియం, పాలలోని కాల్షియం కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి. డైరీ పాలకు బదులు కొబ్బరిపాలు వాడటం వల్ల శరీరం చలువ చేయడంతో పాటు మరింత పోషకాలు అందుతాయి.

March 3, 2026 / 07:27 AM IST

అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా?

కొందరికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టదు. కానీ అంతసేపు నిద్రపోకుండా ఉండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు ఫోన్ చూసేవారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. రాత్రి తక్కువగా తినాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం తీసుకోవాలి. గది ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంచుకోవాలి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవాలి. నిద్రకు గంట ముందే ఫోన్‌ను దూరంగా పెట్టాలి.

March 2, 2026 / 10:30 PM IST

ఒత్తిడి లేని జీవితం.. మీ చేతుల్లోనే!

ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు అలవరుచుకోవడం, అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనశ్శాంతి అనేది కేవలం మెదడుకే కాదు, శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది.

March 2, 2026 / 09:49 PM IST

స్నానం ఇలా చేస్తున్నారా?

స్నానం చేసేటప్పుడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి ఆర్టరీలు పగిలే ప్రమాదం ఉంది. తద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.

March 2, 2026 / 09:44 PM IST

మెంతులతో లాభమెంతో..!

మధుమేహంతో బాధపడేవారికి మెంతులు ఒక వరం లాంటివి. రాత్రిపూట నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పరగడపున తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, జుట్టు రాలడం తగ్గించడానికి, చుండ్రు నివారణకు మెంతుల పేస్ట్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

March 2, 2026 / 09:11 PM IST

పుట్టగొడుగులతో కట్లెట్.. ఎలా చేయాలంటే?

బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. తర్వాత ఉల్లితరుగును వేయించి.. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.. తరిగిన పుట్టగొడుగులు జతచేయాలి. అవి వేగాక.. జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు కలపాలి. చల్లారక.. బంగాళదుంపల ముద్ద వేసి కలపాలి. వాటిని గుండ్రంగా చేసి.. మక్క పిండితో కలిపి నూనెలో వేయించాలి.

March 2, 2026 / 08:44 PM IST

రోజూ ఎన్ని నిమిషాలు నడవాలి

వారానికి 120 నిమిషాలు వాకింగ్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 75 నిమిషాల పాటు నడిస్తే రెండేళ్లు యంగ్‌గా కనిపిస్తారు. రోజుకి 60 నిమిషాల పాటు నడిస్తే ఒబెసిటీ ప్రమాదం సగానికి పైగా తగ్గుతుంది. రోజుకి 40 నిమిషాల నడకతో గుండె సంబంధిత జబ్బులకు స్వస్తి పలకొచ్చు.అదే 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఒత్తిడి, ఆందోళన అదుపులోకి వస్తాయి.

March 2, 2026 / 06:28 PM IST

కళ్లు పొడిబారుతున్నాయా?

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

March 2, 2026 / 02:43 PM IST

విదుర నీతి: వీటికి ఎన్నటికీ తృప్తి ఉండదు

లోకంలో ఆరు అంశాలకు ఎప్పుడూ తృప్తి ఉండదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అగ్ని ఎన్ని కట్టెలు వేసినా ఆరదు, సముద్రం ఎన్ని నదులు కలిసినా నిండదు. మృత్యువుకు ఎన్ని ప్రాణాలు తీసినా చాలు అనిపించదు. అలాగే లోభికి ధనంపై ఆశ, జ్ఞానికి విద్యపై జిజ్ఞాస, అందమైన స్త్రీకి అలంకరణపై మోజు ఎప్పటికీ తీరవు. వీటి సహజ స్వభావాన్ని గ్రహించి మెలగడమే ఉత్తమమని విదుర నీతి సారాంశం.

March 2, 2026 / 08:00 AM IST

మఖానాతో ఆరోగ్య ప్రయోజనాలు

మఖానా (తామర గింజలు) అద్భుతమైన పోషక విలువలున్న సూపర్‌ ఫుడ్. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.మఖానాతో ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తపోటు, బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

March 1, 2026 / 04:50 PM IST

జుట్టు విషయంలో.. ఈ జాగ్రత్తలు!

తలస్నానం తర్వాత జుట్టు విషయంలో జాగ్రత్తలు అవసరం. తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు రాలుతాయి. అలాగే కుదుళ్లు బలహీనంగా ఉన్నప్పుడు దువ్వడం, జడ వేయడం మంచిది కాదు. హెయిర్ స్ప్రేలను నేరుగా జుట్టుపై వాడకూడదు. వాటిలోని ఆల్కహాల్ హాని చేస్తుంది. కాబట్టి స్ప్రేను ముందుగా చేతుల్లోకి తీసుకుని, ఆపై జుట్టుకు రాసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

March 1, 2026 / 03:07 PM IST

మధ్యాహ్న భోజనం.. జాగ్రతలు తప్పనిసరి

ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీ ఉంచితే బద్ధకం, నిద్ర రావు. అన్నంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినడం మానేయాలి. చివరగా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాతే నీళ్లు తాగడం ఉత్తమం.

March 1, 2026 / 01:55 PM IST