CTR: తుఫాను కారణంగా వైద్యాధికారులకు మూడు రోజులపాటు సెలవులు రద్దు చేసినట్లు డీఎంహెచ్వో ప్రభావతి దేవి తెలిపారు. వైద్యాధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. ఇంటింటి సర్వే చేపట్టి అనారోగ్య సమస్యల గుర్తించి తెలుసుకోవాలని ఆదేశించారు. డయేరియా పెరగకుండా చూసుకోవాలని చెప్పారు.
KDP: లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతి కళ తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్‌లో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరి కమిటి మీటింగ్ జరిగింది. ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డ అని తెలియగానే కుటుంబ పెద్దల ఒత్తిడితో గర్భస్రావానికి సిద్ధమవుతున్నారన్నారు.
EG: గొల్లప్రోలు మండలం దుర్గాడలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 8గంటల నుండి గ్రామంలోని ఆదర్శ పాఠశాల నందు ఈ శిబిరం జరుగుతుందన్నారు. ఈ శిబిరం ప్రముఖ వైద్య నిపుణులచే అన్ని వ్యాధులకు ఉచిత పరీక్షలు మందులు అందజేస్తామని తెలిపారు.
గంగవల్లి ఆకులో విటమిన్ A, B, Cలతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరను తినడం వల్ల బరువు తగ్గవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత దరిచేరదు. ఎముకలు దృఢంగా మారుతాయి. కంటి సమస్యలు తగ్గుతాయి. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
కొంతమంది మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. అయితే జామాకులతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు ఉన్నచోట జామాకుల పేస్ట్‌ని రోజూ అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి. సమపాళ్లలో జామాకు పేస్ట్, కలబంద గుజ్జు తీసుకుని అందులో చిటికెడు పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉం...
విటమిన్-డి లోపం వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ఉదయం కాసేపు ఎండలో గడిపితే శరీరానికి తగినంత విటమిన్-డి లభిస్తుంది. అంతేకాక మనం తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు రోజూ తినాలి. సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ తాగాలి. అరటిపండు, అంజీర్ వంటివి తీసుకోవాలి.
GNTR: దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.
➢ పరగడుపునే అరటిపండు తింటే రక్తంలో మెగ్నీషియం, కాల్షియం స్థాయిలో మార్పులు వస్తాయి. ➢ కాఫీ, టీ తాగడం వల్ల జీర్ణాశయం గోడల పూతలో మార్పులొస్తాయి. ➢ కారంతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్‌ల స్థాయి ప్రభావితం అవుతుంది.➢ ఖాళీ కడుపుతో టమాటా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
CTR: భార్య అలిగి వెళ్లిందని ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిమ్మనపల్లె మండలం గార బురుజుకు చెందిన నాగరాజు కొడుకు శివ(20) భార్య అలిగి పుట్టినింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు బాధితుడిని వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
నల్ల మిరియాలు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. నల్ల మిరియాల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
సాధారణంగా వంటల్లో పల్లి, సన్‌ఫ్లవర్ వంటి నూనెలు వాడుతారు. అయితే ఆలివ్ ఆయిల్ వాడకం ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం దరిచేరదు. పోషకాల శోషణ పెరిగి శరీరానికి శక్...
పసుపు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు వీటిని తాగటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. లోబీపీతో బాధపడే వారు పసుపు పాలు తాగితే బీపీ ఇంకా తగ్గిపోతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. డయాబెటిస్ రోగులు ఈ పాలు తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
పకృతి నుంచి సహజ సిద్దంగా చెట్ల ద్వారా వచ్చే తాటికల్లు, ఈత కల్లు వలన బోలెడు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కల్లులో పొటాషియం, విటమిన్ B,C,E ఉంటాయని.. వీటి వల్ల గుండె, కంటి, చర్మ సంబధిత సమస్యలు రాకుండా నివరిస్తుందన్నారు. కిడ్నీలో వచ్చిన రాళ్లను సైతం తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరచడంలో తోడ్పడుతుందన్నారు.