‘తాను చేయబోయే పనిని, వేసుకున్న ప్రణాళికను ముందుగా ఇతరులకు చెప్పకూడదు’ అని విదురుడు సూచించాడు. ఏ వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు ఇతరులకు ముందుగా తెలియకుండా పని పూర్తయ్యాక ఫలితం ద్వారా లోకానికి తెలుస్తుందో.. అతడే నిజమైన బుద్ధిమంతుడు. పని మొదలుపెట్టక ముందే గొప్పలు చెబితే ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి కార్యసాధకుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోవాలని విదుర నీతి సారాంశం.