• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

పిల్లలు ఎత్తు పెరగాలంటే..!

పిల్లల ఎత్తు పెరగడానికి పోషకాహారం, వ్యాయామం చాలా ముఖ్యం. స్ట్రెచింగ్, కాలి వేళ్లను తాకడం, వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీని ఇచ్చే సైడ్ బెండ్స్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడంలో బాగా పనిచేస్తాయి. బార్ హ్యాంగింగ్, పులప్స్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వల్ల కండరాలు సాగి ఎత్తు పెరుగుతారు. వీటితో పాటు విటమిన్ డి, సీజనల్ పండ్లు, ఆకుకూరలు వంటి సమతుల్య ఆహారం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

March 7, 2026 / 03:35 PM IST

ఒత్తిడిలో ఎక్కువ తింటున్నారా?

ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం (స్ట్రెస్ ఈటింగ్) తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణక్రియను దెబ్బతీయడమే కాకుండా నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత, సరైన ఆహారపు అలవాట్లు ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

March 7, 2026 / 01:59 PM IST

కోకోతో మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది!

జపాన్ పరిశోధనల ప్రకారం, కోకోలో ఉండే ఫ్లావనాల్స్ మెదడుకు రక్త ప్రసరణను, ఆక్సిజన్‌ను పెంచుతాయి. ఇది మీ ఏకాగ్రతను పెంచి, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక అలసటను తగ్గిస్తుంది. రోజుకు మూడు చెంచాల కోకో పౌడర్‌ను పాలు లేదా నీటిలో కలిపి తాగడం వల్ల మీ మెదడు మరింత చురుగ్గా, ఉల్లాసంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

March 7, 2026 / 12:43 PM IST

మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదలకూడదు?

హిందూ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదలకూడదు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని గరుడ పురాణం చెబుతోంది. మృతదేహం నుంచి వచ్చే ఒక రకమైన వాసనకు చీమలు, కీటకాలు లేదా ఎలుకలు వంటివి త్వరగా ఆకర్షితమవుతాయి. అలాగే ఆత్మ తన శరీరాన్ని చూస్తూ అక్కడే తిరుగుతుందని, అందరూ తన పక్కన ఉండటం వల్ల ఆ ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

March 7, 2026 / 12:33 PM IST

కిడ్నీలో రాళ్లు తగ్గించే చిట్కాలు

కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవడానికి రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్‌లోని సిట్రిక్ యాసిడ్ రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. ఉప్పు, చక్కెర, పాలకూర, టొమాటో గింజల వాడకం తగ్గించాలి. కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు మూత్రపిండాలను శుభ్రపరిచి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తాయి. సరైన ఆహారపు అలవాట్లతో రాళ్లు ఏర్పడకుండా సులభంగా నిరోధించవచ్చు.

March 7, 2026 / 10:57 AM IST

దాహం వేయకపోయినా.. నీళ్లు తాగండి!

TG: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మూడు రోజుల పాటు 12PM నుంచి 3pm వరకు అత్యవసరం అయితే తప్ప, బయటకు రావద్దని తెలిపింది. దాహం వేయకపోయినా ప్రజలు తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేసింది.

March 7, 2026 / 10:15 AM IST

విదుర నీతి: ఈ ఒక్కదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

మనిషి తన జీవితంలో డబ్బు కంటే తన ‘శీలాన్ని’ (క్యారెక్టర్) జాగ్రత్తగా కాపాడుకోవాలని విదురుడు బోధించారు. ధనం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది.. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి చేజారిన నడవడిక, పోయిన పరువు మళ్లీ తిరిగి రావు. డబ్బు లేనివాడు ఎప్పటికీ పేదవాడు కాదు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినవాడు జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టే లెక్క అని విదురుడు చెప్పారు.

March 7, 2026 / 08:00 AM IST

ఉదయాన్నే స్నానం ఎందుకు చేయాలి..?

TG: స్నానం చేయడం అనేది కేవలం ఒంటిని శుభ్రం చేసుకోవడమే కాదు, మన దేశంలో స్నానానికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని నమ్ముతాం. దీనికి తోడు భారత్ ఒక ఉష్ణమండల దేశం. రాత్రి నిద్రలో మనకు విపరీతంగా చెమట పడుతుంది. అందుకే ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అలసట పోయి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.

March 7, 2026 / 07:53 AM IST

తగినంత నీరు తాగుతున్నారా..?

తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యవసరం. ఒక వ్యక్తి రోజుకు సగటున 3-4 లీటర్ల నీరు తాగాలి. వేసవీలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంటుంది. నీరు తక్కువైతే అలసట, తలనొప్పి వస్తాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఉండటానికి వాటర్ బాటిల్ ఎప్పుడూ కంటికి కనిపించేలా ఉంచుకోండి. తాగాలనిపించకపోయినా తరచూ కొన్ని నీళ్లు తాగండి. ఇప్పుడే ఒక చిన్న సిప్ వేయండి.

March 6, 2026 / 08:56 PM IST

తాటి ముంజలు తింటున్నారా..?

వేసవికాలంలో తాటిముంజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ ముంజ‌లు శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇవ్వ‌డంతోపాటు.. వ‌డదెబ్బ‌, డీహైడ్రేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేస్తాయి. ముంజ‌ల్లో ఫైబ‌ర్, ప్రోటీన్, విట‌మిన్ ఎ, సి, ఇ, కె ల‌తో పాటు ఐర‌న్, ఫాస్ప‌ర‌స్, పొటాషియం వంటి పోష‌కాలు ఉంటాయి.

March 6, 2026 / 06:51 PM IST

వేసవిలో ఏ జ్యూస్ మంచిదంటే..?

వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటితో పాటు పుచ్చకాయ జ్యూస్, మామిడి జ్యూస్, నిమ్మరసం, మజ్జిగ, నారింజ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

March 6, 2026 / 03:55 PM IST

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా..?

ప్ర‌స్తుతం ఇయ‌ర్ ఫోన్స్‌ను ఎక్కువ‌గా వాడుతున్నారు. దీంతో కొన్ని అనారోగ్య ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వినికిడి శ‌క్తి త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని.. చెవిలో నిరంత‌రం లాగుతున్న‌ట్టు, మోగుతున్న‌ట్టు లేదా ఏదో తెలియ‌ని శ‌బ్దం విన‌బ‌డిన‌ట్టు ఉంటుందట.

March 6, 2026 / 03:48 PM IST

శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఇలా జరుగుతుందా!

కొందరు మట్టి, కాగితం లేదా సుద్ద వంటివి తింటుంటారు. ఈ వింత కోరికను ‘పికా’ అనే రుగ్మతగా వైద్యులు చెబుతారు. శరీరంలో ఐరన్ లోపం వల్లనే ఇలాంటి అలవాటు ఏర్పడుతుందని, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని అంటున్నారు. అలాగే, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

March 6, 2026 / 02:25 PM IST

అక్యూపంక్చర్.. సూదులతో రోగాలకు చెక్

అక్యూపంక్చర్ ఓ పురాతన చైనీస్ చికిత్సా విధానం. శరీరంలోని నిర్దిష్ట పాయింట్ల వద్ద సన్నని సూదులను ఉంచడం ద్వారా శరీర శక్తిని(Qi) క్రమబద్ధీకరిస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక నొప్పులు (కీళ్లు, వెన్ను, మెడ), తీవ్రమైన ఒత్తిడి, మైగ్రేన్ సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఇది ఎటువంటి మందులు లేకుండా సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే సురక్షితమైన పద్ధతి.

March 6, 2026 / 11:14 AM IST

టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా?

టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇందులో ఆక్సలేట్ల కారణంగా పరిమితంగా తిన్నంత వరకూ ఎలాంటి ప్రమాదం లేదు. పైగా టమాటాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా ఆక్సలేట్లు శరీరంలోని క్యాల్షియంతో కలిస్తే క్రిస్టల్స్ ఏర్పడతాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసే క్రమంలో ఈ క్రిస్టల్స్ రాళ్లుగా మారి అక్కడే ఉండిపోతాయి.

March 6, 2026 / 10:54 AM IST