ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఇంట్లోనే గుమ్మడికాయతో నేచురల్ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే అందం మరింత రెట్టింపు అవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు రాకుండా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు ద...
మనం తినే రకరకాల ఆహారాలు, పలు అనారోగ్య సమస్యలకు ఉపయోగించే యాంటీబయోటిక్స్ వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే వాటిని తొలగించకపోతే బరువు పెరగటం, చర్మం నిర్జీవంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే లీటరు నీటిలో కీరదోస, పుదీనా, దాల్చిన చెక్క వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా నీటిలో అల్లం ముక్క, నాలుగు తులసి ఆకులు, బత్తాయి ముక్కలు వేసి నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత ఆ నీటిని తాగా...
సాధారణంగా బిర్యానీ ఆకును వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. వంటల్లో ప్రత్యేక రుచిని తెచ్చే ఈ ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బిర్యాని ఆకులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్ర సంబంధిత సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తుంది. శరీరంలోని క్యాన్సర్ కణాలను కూడా నయం చేస్తుంది. బిర్యానీ ఆకులు ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.2. గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.3. శ్వాసకోశ వ్యాధులను రాకుండా చేస్తుంది.4. శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది.5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.6. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
1. సమతుల్య ఆహారం తీసుకోవాలి.2. ఆహారంలో చికెన్, చేపలు, పప్పులు, గింజలను తీసుకోవాలి.3. రోజంతా కేలరీలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోకూడదు.4. నీళ్లు ఎక్కువగా తాగాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి.5. రోజూ 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి.6. సరైన నిద్రతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
భావోద్వేగానికి గురైనప్పుడు కన్నీళ్లు రావటం సహజం. తీవ్రమైన దుఃఖం నుంచి విపరీతమైన ఆనందం వరకు అనేక రకాల భావోద్వేగాలకు సహజ ప్రతిస్పందన కన్నీళ్లు. అయితే ఏడుపు.. ఒత్తిడి, మానసికంగా కలిగే నొప్పిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కన్నీళ్లలోని లైసోజైమ్ అనే ద్రవం బ్యాక్టీరియాను నిశింపచేసి, కళ్లను శుభ్రంగా ఉంచుతుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం వినికిడి లోపం ఉన్నవారికి డీఈఐసీ కేంద్రం, ఈఎన్ టీ విభాగం ద్వారా ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి తెలిపారు. వైద్యులు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. ఆధార్, రేషన్ కార్డు, రెండు ఫొటోలు, ఆడియోగ్రామ్ రిపోర్టు తీసుకురావాలన్నారు.
తూ.గో: పెదపూడి శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వద్ద గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయం వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా సత్య సాయిబాబా సేవా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ గోవిందరాజులు తెలిపారు. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దొండకాయ తినడం వలన మతిమరుపు వస్తుందని చాలా మంది అంటుంటారు. అందుకే కొంతమందికి దొండకాయ తినాలని ఇష్టం ఉన్నా.. తినడానికి వెనకాడుతారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని షోషహాకార నిపుణులు తేల్చిచెప్పారు. దొండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని తింటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో షుగర్ పేషంట్లు కూడా దొండకాయను పుష్కలంగా తినవచ్చని సూచిస్తున్నారు.
పండ్లు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. అయితే స్టోన్ ఫ్రూట్స్‌తో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద గింజ, దాని చుట్టూ గుజ్జు ఉండే మామిడి, పీచ్, ఆప్రికాట్స్, చెర్రీస్ వంటి పండ్లని స్టోన్ ఫ్రూట్స్ అంటారు. వీటిలో పుష్కలంగా ఉండే ఔషధగుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలను తగ్గిస్తాయి. అలసట, నీరసం దరిచేరదు. కణాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. తెల్ల రక్తకణాల సంఖ్య పెరు...
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కలబంద, పెరుగు మిశ్రమం జుట్టుకు తగినంత పోషణ అందిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కలబంద గుజ్జుకి 2 స్పూన్ల పెరుగు, 2-3 చుక్కల టీట్రీ, జోజోబా ఆయిల్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి 2సార్లు ఇలా చేస్తే జుట్టుకు తేమ అంది మృదువుగా మారుతుంది. చుండ్రు సమస్య దూరమవుతుంది. వెంట్రుకలు చిట్లటం తగ్గుతు...
ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ జరగనుంది. ఈ మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం.హనుమంతరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 2,34,993 గొర్రెలు, 91,999 మేకలకు మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జీవాల పెంపకందారులు ఈ మందును గొర్రెలు, మేకలకు అందించాలన్నారు.
ఉదయం నడక వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేగంగా నడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గడంతో పాటు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎముకలు పటిష్టంగా మారతాయి. బరువు తగ్గించుకోవడానికి నడక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. నడక ఆయుష్షును పెంచుతుంది. దీనివల్ల 16-20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమేయవచ్చు.
ఉదయం మనం తీసుకునే ఆహారం ప్రభావం రోజంతా ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్ధాలు తినటం వల్ల పొట్ట, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్లు, ఫ్రైడ్ ఫుడ్, సుగంధద్రవ్యాలు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, కార్బొనేటెడ్ పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కెఫిన్ ఉన్న పదార్థాలు, పాలు, జున్ను, పెరుగులోని లాక్టోస్ వల్ల గ్యా...
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.2. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.3. గాయాలను నయం చేస్తుంది.4. జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.5. కాలేయానికి రక్షణ కల్పిస్తుంది.6. అధిక బరువును తగ్గిస్తుంది.7. కంటి సమస్యలను దూరం చేస్తుంది.