గద్వాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కంటి ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అన్నారు. ఆదివారం గద్వాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కంటి ఆపరేషన్ థియేటర్‌ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ప్రారంభించారు.
KMM: దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఇవాళ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలంకి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
చర్మ రక్షణకు వాడే ఉత్పత్తులే కాదు.. ముఖం శుభ్రపరచుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వాటర్‌ప్రూఫ్ మేకప్ నూనె ఆధారిత రిమూవర్లను వాడి తొలగించిన తర్వాత చల్లని నీటితో ముఖం తప్పనిసరిగా కడగాలి. రోజూ స్క్రబ్‌ని వాడకూడదు. ఫేషియల్ చేయించుకున్నాక, పీల్ఆఫ్ మాస్కులు వాడిన తర్వాత 6గంటల వరకు ముఖం కడగకూడదు. ఫేస్‌వాష్ చేసిన ప్రతిసారీ సబ్బుతో కాకుండా చల్లని...
చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. జలుబు, ఫీవర్ వంటివి దూరమవుతాయి. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అధిక రక్తపోటు, అధిక బరువు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉషోగ్రతలను సమతుల్యం చేస్తుంది.
భోజనం చేసేటప్పుడు చాలామంది నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం చేసే సమయంలో సోడాలు, కూల్‌డ్రింక్స్ వంటివి తాగకూడదు. అయితే భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువసార్లు టీని మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె, కాలేయ ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు , దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. శరీరం పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.
చలికాలంలో బొప్పాయి ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాడీని వెచ్చగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూ రోగులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఒంగోలులోని ఆంజయ్య రోడ్లో గల ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సంతానోత్పత్తి కేంద్రంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ యామిని చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ శిబిరంలో మహిళలకు సంతాన సమస్యలపై వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.
1. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.2. మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి.3. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తాయి.4. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.5. నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది.6. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.7. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.
నారింజ పండు తిని తొక్కలని పడేస్తుంటారు. కానీ ఆ తొక్కలతో చాలా లాభాలున్నాయి. ఆరెంజ్ తొక్కల పొడిలో తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసి మరిగించిన నీరు.. రూమ్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో రెండు వారాల పాటు ఈ తొక్కల్ని నానబెట్టి తర్వాత వడకట్టిన నీటితో కిచెన్ గట్టు, స్టవ్ క్లీన్ చేస్తే మరకలు క్షణాల్లో తొ...
ముఖం మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేస్ క్లీన్, ఫేషియల్ వంటివి చేయించుకుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్‌తో ముఖ ఛాయను పెంచుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గుజ్జు, కలబంద, తేనె కలిపి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు, ట్యాన్ తగ్గిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా, బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వారానికి 2సార్లు ఈ ప్యాక్ వేసుకు...
ఐస్ బాత్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటిలో 5-15 నిమిషాల పాటు శరీరాన్ని ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిద్ర మంచిగా పడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి మంచిది. కండరాల పునరుద్ధరణను పెంచుతుంది. కానీ నరాల సమస్య, గుండె సమస్య, సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మం...
ఇటీవల కాలంలో పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. పదేళ్లలోపు పిల్లల్లే ఊబకాయులుగా మారటం ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవటమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా లోపించటం వల్ల ఆహారం మీద నియంత్రణ దారితప్పుతుంది. అందుకే పసివయసు నుంచే మంచి ఆహారపు అలవాట్లు చేయాలి. నిర్ణీత వేళల్లో తగినంత పోషకారం ఇవ్వాలి. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ వంటివి పె...
1. శరీరంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.2. కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది.3. రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.4. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.5. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.6. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.7. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.