నరాల బలహీనత అనేది ఏ వయసు వారికైనా ఇబ్బంది కలిగించే సమస్య. దీనిని అధిగమించడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆసనాలు వేస్తే నరాల బలహీనత తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భుజంగాసనం, వజ్రాసనం, వంతెన భంగిమ, శవాసనం, బాలాసనం వంటి ఆసనాలతో నరాల బలహీనతను తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ ఏడాదిలో చివరి సూపర్ మూన్.. రేపు కనువిందు చేయనుంది. భూమికి అత్యంత సమీపంగా రావడం వల్ల.. సాధారణ పౌర్ణమితో పోలిస్తే చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడు. ఉదయం 3:44 సమయంలో పూర్తి పౌర్ణమి దశను చేరుకుంటుంది. ఇది ఈ ఏడాదిలో మూడో సూపర్ మూన్. అక్టోబర్‌లో హార్వెస్ట్ మూన్, నవంబర్‌లో బీవర్ మూన్ తర్వాత వచ్చే ఈ కోల్డ్ మూన్‌ను ‘లాంగ్ నైట్ మూన్’ అని కూడా అంటారు.
షాడో డ్రాయింగ్ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కలు, ఆకులు తదితర వాటి నీడని అనుసరిస్తూ పేపర్‌పై గీయడాన్ని షాడో డ్రాయింగ్ అని అంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. విటమిన్ D కూడా లభిస్తుంది. అయితే మధ్యాహ్నం, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఉదయం 10-11 గంటల మధ్య, సంధ్య వేళల్లో దీనికి సమయం కేటాయించాలి.
కాఫీ, టీలు లాంటివి హిడెన్ క్యాలరీలను పెంచుతాయి. స్వీట్ డ్రింక్స్‌కు బదులు వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగాలి. ఫ్రూట్ జ్యూస్‌లో చక్కెర వాడకూడదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఇంటి చుట్టూ లేదా బాల్కనీలో వాక్ చేయాలి. ఓట్స్ విత్ ఫ్రూట్స్, నట్స్, ఎగ్స్ విత్ వెజిటబుల్స్ వంటివాటిని తీసుకోవాలి. వీటి వల్ల రోజంతా ఎనర్జీ స్థిరంగా ఉంటుంది.
భోజన అనంతరం రక్తంలో షుగర్ శాతం భారీగా పెరిగేందుకు పిండిపదార్థాలు ముఖ్యకారణం. అన్నం, రొట్టెలు, అటుకులు, ఇడ్లీ, పండ్లు వంటి ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు 45 నిమిషాల్లో రక్తంలో షుగర్‌ను 100-250కి పెంచేస్తాయి. కాబట్టి ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరించవచ్చు. దీంతో మీ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
తిన్న 4-6 గంటల తర్వాత దంతాలపై ప్లేక్ అనే జిగట పొర ఏర్పడటం మొదలవుతుంది. 12 గంటల తర్వాత ఈ ప్లేక్ గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. 24 గంటల తర్వాత చిగుళ్లు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఎయిమ్స్‌కి చెందిన దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఒక రోజు పళ్లు తోముకోకపోతే నోటిలో ఒక మిలియన్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.
ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తున్నారా? అయితే మీరు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే 58 నిమిషాల పని, 2 నిమిషాల వ్యాయామం అనే ఫార్ములాను ఫాలో అవ్వాలని సూచించారు. అంటే ప్రతి గంటకు రెండు నిమిషాలు నిలబడి వ్యాయామం చేయాలి. మిగిలిన 58 నిమిషాలు పని చేయాలి.
పాలలో క్యాల్షియం , విటమిన్ డి, లినోలినిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. పాలను ఉదయం తాగడం వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. పాలను రాత్రిపూట తాగితే బరువు తగ్గడంతోపాటు నిద్ర సమస్యలు దూరమవుతాయి. అయితే, రాత్రిపూట పాలు తాగేవారు కొవ్వు తీసిన పాలను తాగాలి.
తాజా అంజీర్ పండ్లు తేలికగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. వీటిలో అధిక నీటి శాతం ఉంటుంది. ఇది తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిని తరచుగా తినడం వల్ల స్పష్టమైన, మెరిసే చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. బరువును నియంత్రించుకోవడానికి ఇబ్బంది పడే వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, వీటిని వేసవిలో తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
బెల్లం దాదాపు 70-75 శాతం సహజ చక్కెరను కలిగి ఉంటుంది. అందువల్ల, దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పటికే మధుమేహం ఉంటే దీనికి దూరంగా ఉండటం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 100 గ్రాముల బెల్లం దాదాపు 380 కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
మఖానా(లోటస్ సీడ్స్)లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు అదుపులో ఉంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉండటంతో పాటు గుండె జబ్బులు దరిచేరవు. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది.
పెళ్లి ఖర్చులు పెరిగి, హనీమూన్ కోసం అప్పులు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ‘మినీ మూన్’. ఇది 2 నుంచి 5 రోజుల చిన్న వెకేషన్. భారీ ఖర్చులు లేకుండా.. దగ్గర్లోని ప్లేస్‌కి వెళ్లి చిల్ అవ్వడమే దీని కాన్సెప్ట్. దీనివల్ల టైం, మనీ సేవ్ అవుతాయి. లీవ్స్ టెన్షన్ ఉండదు. ఈ షార్ట్ ట్రిప్ కానిచ్చేసి.. తర్వాత తీరిగ్గా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి మీరు రెడీనా?
రాత్రి నిద్రపోయే ముందు ఒకటి లేదా రెండు లవంగాలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే, మంచి, గాఢమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
అకస్మాత్తుగా వచ్చే సమస్యల్లో చెవి పోటు కూడా ఒకటి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చెవిలో వేయాలి. దీంతో నొప్పి తగ్గడంలో పాటు చెవి కూడా క్లీన్ అవుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బను వేడి చేసి దంచి వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.