• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

రాగి పాత్రలోని నీళ్లు.. అమృతం లాంటివి!

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు నీటిని రాగి పాత్రలో పోసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ గ్రంథిని క్రమబద్ధీకరించడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది..

April 12, 2026 / 11:31 AM IST

మెంతి గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

మెంతి గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతి కీలకంగా పనిచేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గిస్తుంది. చుండ్రును తగ్గించి, జుట్టు దృఢంగా మారేలా చేస్తుంది. అంతేకాదు మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

April 12, 2026 / 10:13 AM IST

మంచి మాట: సమస్యలు లేని జీవితం ఉండదు!

జీవితంలో సమస్యలు లేని ప్రయాణం ఉండదు. మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే అసలైన జీవన మార్గం. ఒక సమస్యను పరిష్కరించుకున్న తర్వాత వచ్చే అనుభవంతో, తదుపరి రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలమనే ధీమాను పెంచుకోవాలి. ముఖ్యంగా, నిరంతరం తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కోవచ్చు.

April 12, 2026 / 07:45 AM IST

భుజ పిడాసనం వల్ల కలిగే ఉపయోగాలు

భుజ పిడాసనం అనేది ఒక మధ్యస్థ-ఉన్నత స్థాయి యోగాసనం. ఇది భుజాలు, చేతులు, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం వెన్నెముకను సాగదీయడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చేతులు, భుజాలపై ఒత్తిడిని కలిగిస్తూ.. శ్వాసకోశ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. భుజం నొప్పి లేదా గాయాలు ఉంటే ఈ ఆసనం చేసే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.

April 12, 2026 / 06:25 AM IST

పేపర్ ప్లేట్లో తింటున్నారా? జాగ్రత్త!

ఆరోగ్య రక్షణ కోసం నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేపర్ ప్లేట్లపై ఉండే ప్లాస్టిక్ పూత వేడి ఆహారంతో కరిగి శరీరంలోకి చేరడం వల్ల క్యాన్సర్, హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ప్లాస్టిక్ కోటింగ్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు లేదా విస్తరాకులు వాడటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.

April 11, 2026 / 07:40 PM IST

ఎండ దెబ్బకు చర్మంపై చెమటకాయలా?

ఎండల వల్ల వచ్చే చెమటకాయల నుండి ఉపశమనం పొందేందుకు గంధం, ముల్తానా మట్టి, కలబంద జెల్ వాడటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. వేపాకులను వేసి మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగి శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. సమస్య తీవ్రమైతే వెంటనే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.

April 11, 2026 / 05:51 PM IST

ఎండ వల్ల చర్మం నల్లబడిందా?

ఎండాకాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మం నల్లగా మారడం (ట్యాన్) సర్వసాధారణం. అయితే, ఈ సమస్యకు మామిడి పండుతో ఇంట్లోనే సులభంగా పరిష్కారం పొందవచ్చు. మామిడి గుజ్జులో శెనగపిండి, బాదం పొడి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మళ్లీ కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ వాడే ముందు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

April 11, 2026 / 04:40 PM IST

అందుకే వేసవిలో బార్లీ నీళ్లు మంచివట!

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి బార్లీ నీళ్లు ఒక అద్భుతమైన పానీయం. ఇవి శరీరానికి తక్షణమే చలువను అందించి, డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. బార్లీలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అందుకే ఎండల వేళ బార్లీ నీళ్లు తాగడం ఎంతో మేలు.

April 11, 2026 / 03:45 PM IST

తాటిముంజలు తింటే కలిగే లాభాలు తెలుసా?

వేసవిలో తాటిముంజలు తింటే శరీరాన్ని చల్లబరిచి, అలసటను తగ్గించి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, మలబద్ధకం, కడుపు మంట సమస్యలను తగ్గిస్తుంది. తాటిముంజల్లో ఉండే అధిక నీటిశాతం వేసవిలో శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. ముంజల గుజ్జును చర్మంపై రాసుకోవడం వల్ల వేసవిలో వచ్చే మొటిమలు, దద్దుర్లు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

April 11, 2026 / 02:30 PM IST

నిద్రపోయినా అలసటగా ఉందా?.. జాగ్రత్త!

రాత్రి ఎనిమిది గంటలు నిద్రించినా మర్నాడు నీరసంగా ఉంటే అది ఐరన్ లోపం లేదా  థైరాయిడ్ లేదా స్లీప్ అప్నియా కావొచ్చు. దీన్ని నివారించడానికి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. పడకగదిలో ఫోన్ వాడకం తగ్గించి, వెలుతురు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

April 11, 2026 / 12:37 PM IST

సోడా, కూల్ డ్రింక్స్‌ తాగితే డేంజర్..!

సోడా, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర, ఫాస్పోరిక్ ఆమ్లం వల్ల ఊబకాయం, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కేవలం ఖాళీ క్యాలరీలను ఇచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లేదా తాజా పండ్ల రసాలు తాగడం ఎంతో మేలు. ఇవి దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

April 11, 2026 / 11:14 AM IST

వేసవి.. వేడి సీటుపై కూర్చుంటున్నారా?

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడానికి ‘వేడి’ ప్రధాన శత్రువు. హెల్తీ స్పెర్మ్ కోసం వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2°C- 3°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడం, టైట్ జీన్స్ ధరించడం, వేడి సీట్లపై కూర్చోవడం వల్ల వీర్యకణాల నాణ్యత, కదలిక మందగిస్తాయి. కాటన్ లోదుస్తులు ధరించండి. బైక్ సీటు చల్లారిన తర్వాత కూర్చోండి.

April 10, 2026 / 06:30 PM IST

ఈ చిట్కాలతో ‘మైగ్రెయిన్’‌కు చెక్..!

మైగ్రెయిన్ తగ్గాలంటే సరైన జీవనశైలి అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 లీటర్ల నీరు తాగడం, తగినంత నిద్ర, సమయానికి భోజనం వంటివి ముఖ్యం. ఖాళీ కడుపుతో టీ, కాఫీలకు బదులు కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నొప్పి తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.

April 10, 2026 / 05:49 PM IST

బొప్పాయి గింజలు తింటే బరువు తగ్గుతారా?

బొప్పాయి గింజల్లో అపారమైన పోషకాలు ఉన్నాయి. ఇవి లివర్‌ను శుద్ధి చేయడమే కాకుండా, కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు 5 నుండి 8 గింజలను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం వీటిలో ఉంది. అయితే, గర్భిణీలు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

April 10, 2026 / 05:17 PM IST

మెరిసే చర్మం కోసం సింపుల్ చిట్కాలు

మెరిసే చర్మం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. రెండు స్పూన్ల శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రం చేసి కాంతినిస్తుంది. మచ్చలు తగ్గి ముఖం మెరవాలంటే తేనె, నిమ్మరసం మిశ్రమం మంచిగా పనిచేస్తుంది. రోజూ పడుకునే ముందు అలోవెరా జెల్ రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ తొలగి చర్మం సహజంగా మెరుస్తుంది.

April 10, 2026 / 03:46 PM IST