సంతాన లేమికి మగవారి ఊబకాయం కూడా కారణమే అని పరిశోధకులు చెప్తున్నారు. బరువు తగ్గితే సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అయితే.. వ్యాయామ నియమాలతో కొద్దిగా బరువు తగ్గినా కూడా వీర్యం నాణ్యత మెరుగవుతుందట. బేరియాట్రిక్ శస్త్రచికిత్సలతో ఎక్కువ బరువు తగ్గినా సానుకూల మార్పులేవీ ఉండవట. దీంతో మగవారు పోషకాహారం, వ్యాయామం మీద దృష్టి పెట్టటం మంచిదని సూచిస్తున్నారు.
కొన్ని చిట్కాలతో కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో అల్లం వేసి బాగా మరిగించి.. వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. లేదంటే పుదీనా ఆకులను తిన్నా లేదా నీటిలో మరిగించి తాగినా ఫలితం ఉంటుంది. నిమ్మ సోడా వాటర్, లవంగాలు, జీలకర్ర నీళ్లు వీటితో కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.
✦ పశ్చాత్తాపం, విషపూరిత బంధాలు✦ మిమ్మల్ని బాధపెట్టినవారిపై పగ✦ ఇతరుల నుంచి ఆశించడం✦ ఓటమి భయం, స్వీయసందేహాలు✦ గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించడం✦ ప్రతికూల ఆలోచనలు✦ మీ నియంత్రణలో లేని విషయాలపై చింతించడం
✦ పశ్చాత్తాపం, విషపూరిత బంధాలు✦ మిమ్మల్ని బాధపెట్టినవారిపై పగ✦ ఇతరుల నుంచి ఆశించడం✦ ఓటమి భయం, స్వీయసందేహాలు✦ గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించడం✦ ప్రతికూల ఆలోచనలు✦ మీ నియంత్రణలో లేని విషయాలపై చింతించడం
తేనెలో ఉండే అధిక శాతం ఫ్రక్టోజ్ కారణంగా కొంతమందికి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో ఫ్రక్టోజ్ సరిగా జీర్ణం కాక పెద్ద పేగులలోకి చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియాతో కలిసి ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మోతాదులో తేనెను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు తీవ్రమైన కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
ఒకేసారి 20 కిలోల బరువు తగ్గాలని ప్రయత్నిస్తే, అది సాధ్యం కాదు. కానీ, ఒక కిలో చొప్పున బరువు తగ్గడంపై దృష్టి పెట్టి, అలా 20 సార్లు ప్రయత్నిస్తే దాన్ని సులువుగా సాధించవచ్చు. అదే విధంగా మీ లక్ష్యాన్ని చిన్న చిన్న ప్రక్రియలుగా విభజించుకుని కృషి చేస్తే, మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే.. మామిడి పండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు, చెర్రీస్, ఫైనాపిల్, లిచీ, అంజీర తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయని నిపుణులు పేర్కొన్నారు.
యాడెడ్ షుగర్లను తగ్గించడం వల్ల వ్యాధుల ముప్పు తగ్గడమే కాకుండా జీవన నాణ్యత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చక్కెర్లను తగ్గించడం వల్ల ఏజీఈలు అనే హానికరమైన పదార్థ ఉత్పత్తి తగ్గుతుందని వివరించారు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే రసాయనాలను చక్కెర అడ్డగిస్తుంది. అందువల్ల తీపిని తగ్గిస్తే కుంగుబాటు ముప్పు తగ్గిపోతుంది.
నిద్రపోయే ముందు చాలామంది ఫోన్ దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. అలా చేయడం వల్ల ఫోన్ రేడియేషన్ మెదడుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నోటిఫికేషన్లు, లైటింగ్ కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటంతో సరైన నిద్ర పట్టదని తెలిపారు. ఫోన్ సైలెంట్ కిల్లర్‌గా మారి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని చెబుతున్నారు.
చికెన్ అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చికెన్ వినియోగాన్ని నియంత్రించడం ముఖ్యమని, సమతుల్యమైన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.
కివీ పండ్లలో విటమిన్లు C, K, E, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకంను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
చాలా మంది ఉదయం ఆఫీసుకు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు. వారాంతపు వినోదాల కోసం ఎదురుచూస్తూ వారమంతా గడుపుతారు. కొత్త ఏడాదిలో అయినా తమ జీవితం మారుతుందేమో అని ఈ ఏడాదంతా కలలు కంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఇలా అందమైన రేపటి కోసం ఎదురుచూస్తూ ప్రస్తుత క్షణాలు ఆస్వాదించడం మర్చిపోకండి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దానిమ్మ గింజల రసంలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి.. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ ఉదయం చక్కెర కలపని దానిమ్మ రసం ఒక గ్లాస్ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. మనిషి శారీరకంగానే కాక మానసికంగా దృఢంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రాణాయామం అంటే శక్తిని మేల్కొల్పడం అని యోగా నిపుణులు చెబుతున్నారు. ప్రాణాయామం చేస్తే మనలో ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. రోజూ చేస్తే శరీరం తేలిగ్గా మారుతుంది. ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న అనేక శారీరక, మానసిక సమస్యలను ప్రాణాయామంతో తగ్గించుకోవచ్చు.
రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు తేలికపడతాయి. ఇది గాఢమైన నిద్రకు ఉత్తమ మార్గం. ముఖ్యంగా నిద్రలేమి లేదా టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కండరాల ఒత్తిడి తొలగిపోయి, నొప్పులు తగ్గుతాయి. రోజంతా పేరుకున్న మురికి, బ్యాక్టీరియా తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్రకు గంట ముందు స్నానం చేయడం మంచిది.