బొప్పాయి పండు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఆకులు, పండులోని విత్తనాలలో అనేక ఖనిజాలతోపాటు పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం పనిచేస్తాయి. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకులను సాంప్రదాయ వైద్యంలో రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను రక్షించడం ద్వారా రక్తంలో చక్కెరను తగ్గించే ప...
బీట్రూట్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. అంతేకాదు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే బీట్రూట్ అతిగా తినటం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ తక్కువగా ఉన్నవారు ఇది తింటే ఇంకా తగ్గిపోతుంది. బీట్రూట్లో అధికంగా ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతుంది. అలెర్జీ సమస్యలు ఎక్కువ అవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మి...
తలకి నూనె పెట్టకపోవటం, చలికాలంలో చర్మం పొడిబారటం వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. చుండ్రు ఏర్పడి తలలో దురద పుడుతుంది. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికోసారైనా కొబ్బరి, బాదం, ఆలివ్ వంటి నూనెలని తలకి పట్టించాలి. నూనె కాస్త వేడిచేసి అప్లై చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తడి జుట్టుని ఎప్పుడూ ముడి...
ఆడవారిలో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. అంజీరాతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంజీరా పండు నేరుగా తిన్నా, డ్రైఫ్రూట్ తిన్నా శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీనిలోని ఐరన్, కాల్షియం రక్తహీనతను దూరం చేస్తుంది. నెలసరి సమయంలో ఉసిరిపొడితో కలిపి ఈ పండుని తింటే మెరుగైన ఫలితాలుంటాయి. అంజీరా హార్మోన్ల హెచ్చుతగ్గుల్ని క్రమబద్ధీకరిస్తుంది. మెనోపాజ్ ఇబ్బందులు తొలగిపోతాయి. మానసిక...
చలికాలంలో చల్లటి గాలులు వీయడం, గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారుతుంది. అయితే ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ వంటివి వాడటం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు వీటిలో ఏదైనా చర్మంపై రాసుకుని మసాజ్ చేయాలి. అలాగే సల్ఫేట్లేని హ్యాండ్ వాష్ లేదా సబ్బును ఉపయోగించాలి. చేతులు కడుక్కోవడానికి గోరువెచ్చని నీటిని వాడాలి. బయటకెళ్లినప్పుడు చేతి గ్లౌజులు ...
చలికాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని బలపరచుకోవటం ఎంతో అవసరం. ఇందుకోసం విటమిన్-సి పుష్కలంగా లభించే పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్, బొప్పాయి, నిమ్మ, ఉసిరి, జామ, కివి పండ్లు తింటే శరీరానికి శక్తి అందటంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే పోషకాలు ఆర్థరైటిస్ నొప్పులని తగ్గిస్తాయి. గాయాల్ని త్వరగా మానేలా చేస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్...
ఉదయాన్నే లేవగానే గోరు వెచ్చని నీళ్లు తాగితే.. జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేందుకు సాయపడుతాయి. చల్లటి నీళ్ల కంటే వేడి నీళ్లు ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. వేడినీళ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారుతాయి. కఫం, దగ్గు, గొంతునొప్పి సమస్యలకు చెక్ పెడుతాయి. చర్మం ముడతలు పడటాన్ని తగ్గి...
జామ ఆకుల టీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డ్రగ్ స్టోర్‌ను వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రగ్ స్టోర్‌లో మందుల నిల్వలతో పాటు రిజిస్టర్లు పరిశీలించారు. మందుల కొరత నివారించడానికి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గ్రీన్ యాపిల్ తింటే పోషకాలతోపాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలు పొందవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. గ్రీన్ యాపిల్‌లో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా, శరీరం వాపులనకు గురికాకుండా చూస్తాయి. ఇది బరువు తగ్గే...
డ్రైఫ్రూట్స్‌ని నిల్వ చేయటంలో చేసే తప్పుల వల్ల త్వరగా పాడవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. గాలి, వెలుతురు తగలని డబ్బాల్లో నిల్వచేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకుంటే గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేయాలి. టోస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎయిర్‌టైట్ ప్యాకెట్లలో ఉంచాలి. మసాలాలతో వీటిని నిల్వ చేయకూడదు. పిస్తా, నట్స్ వంటివి షెల్స్‌తోనే...
SKLM: ఆమదాలవలస లొద్దలపేట గ్రామంలో గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి విలేజ్ క్లినిక్ నిర్మాణం చేపట్టారు. అయితే గత ప్రభుత్వం చివరి దశలో నిధులు మంజూరు చేయని కారణంగా అసంపూర్తిగా ఉండిపోయిందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై నిధుల మంజూరు చేసి క్లినిక్‌ను ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు.
ముఖం అందంగా కనిపించేందుకు రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే కొన్ని పదార్థాలు ముఖ చర్మానికి సరిపడవని నిపుణులు చెబుతున్నారు. బాడీలోషన్నే కొందరు ముఖంపై రాస్తారు. ఇలా చేస్తే మొటిమలు వస్తాయి. నిమ్మరసాన్ని చర్మంపై నేరుగా రుద్దుకుంటే దురద, మంట వస్తాయి. టూత్ పేస్ట్ ముఖంపై రాస్తే మచ్చలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వస్తుంటాయి. ఫేషియల్ వ్యాక్స్ని చర్మతత్వాన్ని బట్టి ఎంచుకుని ప్యాచ్ టెస్ట్ చేసుక...
అవకాడోలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యానికి ఈ పండు సహకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. అవకాడోని తిన్నప్పుడు కడుపు నిండుగా ఉండి ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు పెరగకుండా ఉండవచ్చు. దీనిలో ఉండే ఫోలేట్, విటమిన్-సి, పొటాషియం గర్భిణీలకు ఎంతో మంచిది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కంటి ఆరోగ...
రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. క్యారెట్లలో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో కంటిచూపు మెరుగు పడుతుంది. రేచీకటి సమస్య కూడా ఉండదు. క్యారెట్ తింటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బీపీ నియంత్రణలో, గుండెపోటు...