బొప్పాయి మలబద్ధకానికి అద్భుతమైన ఔషధం. దీనిలోని ‘పాపైన్’ ఎంజైమ్ జీర్ణక్రియను వేగవంతం చేసి, ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని బొప్పాయి ముక్కలు తింటే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి ఇది తోడ్పడుతుంది.
ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగొద్దు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే ‘టానిన్లు’ మొక్కల ఆధారిత ఆహారం నుంచి లభించే ఐరన్ గ్రహణ శక్తిని తగ్గిస్తాయి. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే, అది కాలక్రమేణా రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.
మార్జరి ఆసనం(పిల్లి భంగిమ) వెన్నెముకను సాగదీయడం, దాని సౌలభ్యాన్ని పెంచుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలపై మసాజ్ లాగా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత వెన్నునొప్పిని తగ్గించడానికి, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.
చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. కానీ అంతకంటే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహజసిద్ధమైన ‘డిటాక్స్’ ఏజెంట్‌లా పనిచేస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు.
పుస్తకం తెరవగానే నిద్ర వచ్చినట్లు అనిపించడం సర్వసాధారణం. చదివేటప్పుడు కనుబొమ్మల కండరాలు అలసిపోవడం వల్ల మెదడు నిద్రకు సంకేతాలిస్తుంది. ముఖ్యంగా పడుకుని చదవడం వల్ల శరీరం త్వరగా నిద్రలోకి వెళ్తుంది. అందుకే కుర్చీలో నిటారుగా కూర్చుని, తగినంత వెలుతురులో చదవడం అలవాటు చేసుకోవాలి. బయటకి చదవడం కూడా మంచి చిట్కానే. దీంతో నిద్ర మత్తు వదిలి చురుగ్గా పుస్తకాన్ని చదవగలుగుతారు.
మద్యం తాగి నియంత్రణ కోల్పోవడంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతిగా తాగి బహిరంగ ప్రదేశాల్లో వాంతులు చేసుకోవడం ఇతరులకు అసహ్యం కలిగిస్తుంది. అలాగే, మద్యం మత్తులో గట్టిగా అరవడం, గొడవలు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నవారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. ఇలాంటి ప్రవర్తన వల్ల తన గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా.. ఒంటరివాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, మద్యానికి దూరంగా ఉండండి.
వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్ A, C, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. అలాగే శరీర తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగను తీసుకోవడం కూడా ఎంతో ఆరోగ్యకరం. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండడం ఉత్తమం.
జొజోబా, బాదం నూనెతో తల మర్దన చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగి జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. అయితే అతిగా నూనె వాడితే ముఖం జిడ్డుగా మారి ఇతర సమస్యలు రావచ్చు. మర్దన చేసేటప్పుడు స్ట్రోక్స్ సరిగ్గా లేకున్నా, చేతి గోళ్లు తగిలినా ఇబ్బందే. సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా మర్దన చేసుకుంటే జుట్టుకు పోషణతో పాటు సహజసిద్ధమైన మెరుపు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గోండ్ కటిరా(Tragacanth gum) ఆస్ట్రాగలస్ మొక్కల నుంచి లభించే సహజ రెసిన్. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఎముకలు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రంతా నీటిలో నానిన ఈ జెల్లీని పాలు, మజ్జిగ లేదా జ్యూస్‌లలో కలిపి తీసుకోవచ్చు.
మధ్యాహ్న భోజనం అమితంగా కాకుండా మితంగా, పోషకాలతో నిండి ఉండాలి. భోజనానికి అరగంట ముందు, తిన్న గంట తర్వాతే నీళ్లు తాగాలి. అన్నంలో కూరగాయలు, పప్పు ఉండేలా చూసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. టీ, కాఫీలకు దూరంగా ఉండి, మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో భోజనం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
పాదాల దురద, పగుళ్ల నివారణకు పెప్పర్‌మింట్ ఆయిల్ అద్భుతమైన ఔషధం. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నూనె వేసి పాదాలను నానబెడితే చర్మం మృదువుగా మారుతుంది. ఇది ఎరుపుదనాన్ని తగ్గించి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. రసాయన మందుల కంటే ఈ సహజ చిట్కా మేలని నిపుణులు సూచిస్తున్నారు. మీ పాదాల సంరక్షణకు ఇది సురక్షితమైన మార్గమని చెబుతున్నారు.
దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఇది కేవలం తలనొప్పి కాదు, తీవ్రమైన నాడీ సంబంధిత వ్యాధి. విపరీతమైన నొప్పి, వాంతులు, వెలుతురును భరించలేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఇది మరింత పెరుగుతుంది. సరైన జీవనశైలి మార్పులు, వైద్య చికిత్స ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ముందుగా గోరువెచ్చని నీళ్లు, నూనె రహిత క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేయాలి. ఆలివ్ నూనెతో మెడపై మర్దన చేయడం, వ్యాయామాలు చేయడం వల్ల చర్మం ఉత్తేజితమవుతుంది. కోడిగుడ్డు తెల్లసొన-తేనె మిశ్రమం లేదా పెరుగు-నిమ్మరసం ప్యాక్ వేసి మర్దన చేస్తే మంచిది. కలబంద, తేనె కలిపిన ప్యాక్ కూడా 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం, మెడ కాంతివంతంగా మారుతాయి.
వ్యాయామానికి 30-60 నిమిషాల ముందు తీసుకునే ప్రీ-వర్కౌట్ డ్రింక్స్ శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. బ్లాక్ కాఫీ తక్షణ శక్తినిస్తే, బీట్‌రూట్ జ్యూస్ రక్త ప్రసరణను మెరుగుపరిచి స్టామినాను ఇస్తుంది. నిమ్మరసం-తేనె నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అరటిపండు స్మూతీ కండరాల పనితీరుకు అవసరమైన పొటాషియం, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.