ఎండాకాలంలో సొరకాయ తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది. వేసవిలో దీనిని తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవచ్చు. తద్వారా డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. అధిక వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో మీ డైట్లో ఇది ఉత్తమమైన కూరగాయ.