శరీరంలో ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి మిటమిన్ డి అత్యంత కీలకమైన పోషకం. విటమిన్ డి లభించాలంటే ఎండలో ఉండటం సులభమైన మార్గమని అందరికీ తెలుసు. అయితే కేవలం ఎండలో కూర్చోవడం ల్ల అందరికీ విటమిన్ డి సరిపోతుందని చెప్పలేమని నిపుణులు తెలిపారు. శరీర తత్వం, వయస్సు, చర్మ రంగు, ఎండలో గడిపే సమయం వంటి అంశాలపై దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని చెప్పారు.