కపోతాసనం అనేది వెన్నెముకకు, తుంటి కండరాలకు, ఛాతీకి అద్భుతమైన సాగదీతను అందించే యోగాసనం. నడుము, వెన్నెముక కండరాలను బలోపేతం చేసి, వెన్నుపూసలో దృఢత్వాన్ని తగ్గించి నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది. రక్త ప్రసరణను ప్రేరేపించి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.