ప్రపంచ వినికిడి దినోత్సవం నేడు. ‘అందరికీ వినికిడి సంరక్షణ’ అనే లక్ష్యంతో అవగాహన కల్పించాల్సిన సమయం ఇది. నేటి యాంత్రిక జీవనంలో ఇయర్ఫోన్ల మితిమీరిన వాడకం, శబ్ద కాలుష్యం వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చిన్నప్పుడే వినికిడి పరీక్షలు చేయించుకోవడం, అధిక శబ్దాలకు దూరంగా ఉండటం ద్వారా 60% లోపాలను నివారించవచ్చు. వినికిడి కోల్పోతే తిరిగి రాదు.. జాగ్రత్తే అసలైన రక్షణ.