TG: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు ఎండలతోపాటు.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.