SRD: సంగారెడ్డికి చెందిన బీఆర్ఎస్ నేత అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చురుగ్గా పనిచేయాలని కవిత సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె అరవింద్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు.