అన్నమయ్య: టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సై హుస్సేన్ గ్రామస్తులతో సమావేశమై చోరీల నివారణ, రోడ్డు భద్రత, మహిళా రక్షణ, శక్తి యాప్, డయల్-112, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.