BHNG: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని భువనగిరి మండల విద్యాధికారి పి.నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని భువనగిరి పెన్షనర్స్ భవవనంలో ప్రారంభించి ఆయన మాట్లాడారు.