కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా భారీ వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. గ్రౌండ్‌స్టాఫ్ హుటాహుటిన పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆట నిలిచే సమయానికి ముంబై ఇండియన్స్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.