బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాన మొదలవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.