బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. కానీ, ఉదయం అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి అందక నీరసం వస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడమే కాకుండా, మధ్యాహ్నం అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి మెదడు చురుకుదనం తగ్గుతుంది. అలాగే మెటబాలిజం మందగిస్తుంది.