పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పాలను మానేయడం సరికాదు. శరీర ఆరోగ్యాన్ని బట్టి పాలను ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.