ఉదయం 8 గంటల ప్రాంతంలో అల్పాహారం తీసుకుంటే శరీరంలోని సహజ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. గుండె జబ్బులు, హైబీపీ, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఉదయం 8 గంటలకు తినాల్సిన అల్పాహారాన్ని 9 గంటలకు తింటే.. గుండె సమస్యల ప్రమాదం ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.