IPLలో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం బీహార్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ను చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి అభిమానులు భారీగా క్యూ కట్టారు. తమ ప్రాంతానికి చెందిన ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో, అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులందరితో వైభవ్ ఆప్యాయంగా సమయం గడిపాడు.