మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కోచింగ్ కెరీర్లో ఒకే ఒక్కసారి కోహ్లీని గొడవ పడకుండా అడ్డుకున్నట్లు తెలిపాడు. ‘2014 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మిచెల్ జాన్సన్‌తో కోహ్లీకి వాగ్వాదం జరిగింది. కోహ్లీ డ్రెసింగ్ రూమ్ వైపు వస్తూ.. జాన్సన్‌ను కోపంగా చూస్తూ కనిపించాడు. వెంటనే కోహ్లీని పిలిచి, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని చెప్పా’ అని పేర్కొన్నాడు.