• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

RCBకి మాజీ క్రికెటర్ కీలక సూచన

మే 26న ధర్మశాలలో గుజరాత్‌తో జరగనున్న క్వాలిఫయర్-1 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కీలక సూచన చేశాడు. గాయం నుండి కోలుకున్న ఫిల్‌ సాల్ట్‌ను కాకుండా, గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 19 బంతుల్లో 44 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌నే విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్‌గా ఆడించాలని డౌల్ అభిప్రాయపడ్డాడు.

May 25, 2026 / 07:40 PM IST

పాపం పంజాబ్.!

IPL 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరోసారి దురదృష్టమే ఎదురైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తృటిలో తప్పిపోయింది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేవలం మూడుసార్లే లీగ్ దశ దాటిన పంజాబ్, ఈసారి ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది.

May 25, 2026 / 07:22 PM IST

రిటైర్మెంట్‌కు సిద్ధమైన ఆసీస్ పేసర్!

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల జూన్ 2026లో ఇంగ్లాండ్‌లో జరగబోయే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ తన చివరి అంతర్జాతీయ టోర్నీ కానుందని 33 ఏళ్ల స్కట్ వెల్లడించింది. తదుపరి తరానికి అవకాశాలు ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. 2012లో అరంగేట్రం చేసింది.

May 25, 2026 / 07:00 PM IST

IPLలో ఎక్కువ సార్లు డ‌కౌటైన ప్లేయ‌ర్లు..!

IPL చరిత్రలో అత్యధిక డకౌట్ల రికార్డుతో రోహిత్ శర్మ, మాక్స్‌వెల్ 19 సార్లు అగ్రస్థానంలో ఉన్నారు. దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ 18తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. తర్వాత స్థానంలో చావ్లా, రషీద్ 16 ఉండగా..మన్‌దీప్, రహానే 15, రాయుడు, మనీష్ 14, హర్భజన్, పార్థివ్ 13 చొప్పున డకౌటయ్యారు. కోహ్లీ, అశ్విన్, గంభీర్, శాంసన్, సూర్యకుమార్ చెరో 12 సార్లు సున్నాకే వెనుతిరిగారు.

May 25, 2026 / 05:55 PM IST

IPL-26 లీగ్ దశలో అదరగొట్టిన టాప్ ప్లేయర్స్.!

IPL 2026 లీగ్ దశ ముగిసింది. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ (638 పరుగులు), గిల్ (616), క్లాసెన్ (606) పరుగుల వరద పారించారు. వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన సెంచరీ (36 బంతుల్లో)తో పాటు అత్యధికంగా 53 సిక్సర్లు బాదాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు. 

May 25, 2026 / 05:29 PM IST

యుద్దానికి సిద్దం.. రేపటి నుంచే ప్లే ఆఫ్స్

IPL 2026 లీగ్ దశ ముగియడంతో మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. RCB, GT, SRH, RR జట్లు టాప్-4లోకి దూసుకెళ్లాయి. పాయింట్ల పట్టికతో ఇక పనిలేదు. నాకౌట్ పోరు మొదలైంది. ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న SRH, RRలకు ప్రతి మ్యాచూ ‘డూ ఆర్ డై’ లాంటిదే. గెలిస్తేనే టైటిల్ రేసులో నిలుస్తారు, లేదంటే ఇంటికే. మరి ఈసారి ట్రోఫీ గెలిచే టీమ్ ఏదో కామెంట్ చేయండి.

May 25, 2026 / 04:45 PM IST

గుజరాత్ టైటాన్స్ సరికొత్త రికార్డు

IPL 2026లో గుజరాత్ టైటాన్స్ రికార్డుల వేట కొనసాగుతోంది. 2022లో హార్దిక్ సారథ్యంలో అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన గుజరాత్, ఆడిన 5 సీజన్లలో ఏకంగా 4 సార్లు ప్లేఆఫ్స్ చేరి 80 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఐపీఎల్ 2026లోనూ టాప్-2లో నిలిచి క్వాలిఫైయర్-1కు దూసుకెళ్లిన గుజరాత్ ఈసారి ట్రోఫీ గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.

May 25, 2026 / 04:12 PM IST

రాహుల్ ఉన్న టీమ్‌కు కప్పు రాదా..?

IPL 2026 సీజన్‌లోనూ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. అతడు ప్రాతినిధ్యం వహించిన DC ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. 2013లో RCBతో ప్రయాణం మొదలుపెట్టి..SRH, PBKS, LSG, DC వంటి ఐదు వేర్వేరు జట్లకు ఆడినా, 14 ఏళ్లుగా రాహుల్‌కు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో రాహుల్ ఉన్న టీమ్‌కు IPL కప్పు రాదేమో అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

May 25, 2026 / 02:45 PM IST

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు స్టార్ క్రికెటర్లు

భారత క్రికెటర్ రోహిత్ శర్మ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ‘వేర్వేరు జనరేషన్ల నుంచి వచ్చిన ఇద్దరు ఓపెనర్లు. వారిద్దరిదీ ఒకటే సిక్స్ హిట్టింగ్’ అని క్రికెట్ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును వైభవ్‌ బద్దలుకొట్టడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

May 25, 2026 / 12:42 PM IST

IPL ట్రోఫీ గెలిచేది ఆ జట్టే: అక్షర్ పటేల్

IPL 2026 తుది దశకు చేరుకుంది. RCB, GT, SRH, RR ప్లే ఆఫ్స్‌నకు క్వాలిఫై అయ్యాయి. టైటిల్‌ కోసం ఈ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో GT కెప్టెన్‌ అక్షర్ పటేల్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ‘SRH జట్టు దృఢంగా కనిపిస్తోంది. టాప్ త్రీ బ్యాటర్లు రాణిస్తే.. ఆ టీమ్‌ను అడ్డుకోవడం కష్టం. విన్నర్‌గా SRH నిలుస్తుందని నేను అనుకుంటున్నా’ అని అన్నాడు.

May 25, 2026 / 11:07 AM IST

ట్రావిస్ హెడ్ భార్యపై నెట్టింట వేధింపులు

HYDలో జరిగిన SRH vs RCB మ్యాచ్‌లో కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఈ నేపథ్యంలో హెడ్ భార్య జెస్సికా హెడ్ తీవ్ర సోషల్ మీడియా వేధింపులకు గురవుతోంది. కొందరు నెటిజన్లు ఆమెపై దాడులు చేస్తామని బెదిరించడమే కాకుండా, కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని జెస్సికా ఆవేదన వ్యక్తం చేసింది.

May 25, 2026 / 10:42 AM IST

నేటి నుంచే నార్వే చెస్

నార్వే చెస్‌ టోర్నీ ఇవాళ ప్రారంభంకానుంది. ఇందులో ప్రపంచ ఛాంపియన్‌ గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద.. దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌ బరిలో ఉన్నారు. 10 రౌండ్ల పాటు జరిగే ఈ పోటీలు డ్రా అయితే ‘ఆర్మగెడాన్‌’ టైబ్రేక్‌ నిర్వహిస్తారు.

May 25, 2026 / 10:36 AM IST

ఫ్రెంచ్ ఓపెన్.. ప్రవాసాంధ్రుడు సంచలనం

ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రవాసాంధ్రుడు నిషేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. అమెరికా తరఫున 21 ఏళ్ల నిషేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగాడు. ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఏపీలోని నెల్లూరుకు చెందిన నిషేష్‌ కుటుంబం 1999లో అమెరికాకు వెళ్లింది. 2005లో నిషేష్‌ USలో జన్మించాడు.

May 25, 2026 / 10:09 AM IST

IPL: ప్లే ఆఫ్స్‌కు ముందు.. RCBకి భారీ షాక్!

GTతో రేపు జరగబోయే క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు RCB జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్ వేలి గాయం కారణంగా IPL ప్లే ఆఫ్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈనెల 17న పంజాబ్‌తో మ్యాచ్‌లో గాయపడిన బెథెల్, చికిత్స కోసం ఇంగ్లండ్‌కు తిరుగుపయనమయ్యాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 96 పరుగులు చేశాడు.

May 25, 2026 / 06:00 AM IST

IPL: హిట్‌మ్యాన్ సరసన ‘మిస్టర్ 360’

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. RRతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగులు చేయడం ద్వారా సూర్య.. MI తరఫున IPL, ఛాంపియన్స్ లీగ్ టీ20లలో కలిపి 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శర్మ (6432 పరుగులు) తర్వాత MI తరఫున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా సూర్య సరికొత్త రికార్డు సృష్టించాడు

May 25, 2026 / 01:29 AM IST