IPL 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు మరోసారి దురదృష్టమే ఎదురైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తృటిలో తప్పిపోయింది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేవలం మూడుసార్లే లీగ్ దశ దాటిన పంజాబ్, ఈసారి ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది.