KKRతో మ్యాచ్‌లో DC 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో కోల్‌కతా 163 పరుగులకే ఆలౌటైంది. రహానే (63), పాండే (25), పావెల్ (29) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 3, ఎంగిడి 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సీజన్‌ను DC 6వ స్థానంతో, KKR 7వ స్థానంతో ముగించాయి.
KKRతో మ్యాచ్‌లో DC స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తృటిలో హ్యాట్రిక్ చేజారింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కుల్దీప్ రెండో బంతికి రహానేను, మూడో బంతికి రింకూ సింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతి KKR బ్యాటర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ పోరెల్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే, అతడు క్యాచ్‌ను అందుకోలేకపోవడంతో కుల్దీప్‌కు హ్యాట్రిక్ దక్కకుండా పోయింది.
5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, 2026 సీజన్‌ను 9వ స్థానంలో ముగించింది. టోర్నీ ఆరంభానికి ముందు అత్యంత బలమైన జట్టుగా కనిపించిన ముంబై, 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో చివరి నుండి రెండో స్థానానికి పరిమితమైంది. గత ఐదేళ్లలో MI.. 2022లో 10వ స్థానం, 2023లో Q2, 2024లో 10వ స్థానం, 2025లో Q2, ప్రస్తుతం 2026లో 9వ స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో RR ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 32 పరుగులు చేసిన అతడు, బౌలింగ్‌లో తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఫీల్డింగ్‌లోనూ ఓ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆర్చర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
✦ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)✦ ముంబై ఇండియన్స్ (MI)✦ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)✦ పంజాబ్ కింగ్స్(PBKS)✦ ఢిల్లీ క్యాపిటల్స్(DC)✦ లక్నో సూపర్ జాయింట్స్(LSG)ఈ 6 జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. RCB, GT, SRH, RR జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
✦ మే 26 – క్వాలిఫైయర్ 1: RCB vs GT (ధర్మశాల) ✦ మే 27 – ఎలిమినేటర్: SRH vs RR (చండీగఢ్) ✦ మే 29 – క్వాలిఫైయర్ 2: (చండీగఢ్) ✦ మే 31 – ఫైనల్: (అహ్మదాబాద్) సమయం: అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌లను టీవీలో ‘స్టార్ స్పోర్ట్స్’, మొబైల్‌లో ‘జియో హాట్‌స్టార్’ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో DC నిర్ణీత 20 ఓవర్లలో 203/5 పరుగులు చేసింది. DC బ్యాటర్లు కేఎల్ రాహుల్(60) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. అక్షర్ పటేల్(39), సాహిల్ పరాఖ్(24), అభిషేక్ పోరెల్(22) పరుగులతో రాణించారు. KKR బౌలర్లు సౌరభ్ దుబే రెండు వికెట్లు పడగొట్టగా.. అనుకుల్ రాయ్, సునీల్ నారైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. లక్నోపై 39 బంతుల్లో చేసిన 69 పరుగులతో రెండు వేర్వేరు సీజన్లలో (2025, 2026) 500+ పరుగులు చేసిన తొలి ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ (101*) చేయడంతో లక్నోపై పంజాబ్ 7 వికెట్లతో గెలిచి, 15 పాయింట్లతో 4వ స్థానానికి చేరింది.
ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో RR ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. MI బ్యాటర్లు సూర్య(60), విల్ జాక్స్(33), హార్దిక్ పాండ్యా(34) రాణించినా ఫలితం లేకుండా పోయింది. RR బౌలర్లు ఆర్చర్ 3 వికెట్లు, బర్గర్, బ్రిజేష్ శర్మ, యష్ పుంజా తలో 2 వికెట్లు తీశారు.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా మూడు సీజన్లలో 500+ పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. లక్నో మ్యాచ్‌లో 52 పరుగులివ్వడంతో ఈ సీజన్‌లో అతడి పరుగులు 541కి చేరాయి. పంజాబ్ తరఫున అత్యధికంగా 7 సార్లు 50కి పైగా పరుగులిచ్చిన బౌలర్‌గానూ నిలిచాడు.
ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా.. సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను తమ SM ఖాతాల నుంచి బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై SRH యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే 2016లో తన అద్భుతమైన కెప్టెన్సీతో SRHకు IPL ట్రోఫీని అందించిన వార్నర్, ఇక్కడి అభిమానుల గుండెల్లో ‘తెలుగు తమ్ముడు’గా స్థానం సంపాదించుకున్నాడు.
RRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI కేవలం 5.1ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. MI స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగగా.. రికెల్టన్, తిలక్ వర్మ, నమన్ ధీర్ స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 5.3 ఓవర్లలో 44/4 గా ఉంది. క్రీజులో సూర్యకుమార్(17*), విల్ జాక్స్(5*) గా ఉన్నారు.
IPL-2026లో భాగంగా లక్నో, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో సచిన్ కుమారుడు, అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా సచిన్ కుమార్తె సారా స్పందిస్తూ.. ‘నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి. నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, ఈ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు గర్వంగా ఉంది. లవ్ యు తమ్ముడు’ అని రాసుకొచ్చింది.