లక్నోతో జరుగుతున్న కీలక మ్యాచులో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. కేవలం 3 ఓవర్లలోనే ఏకంగా 17.30 ఎకానమీతో 52 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో PBKS తరఫున అత్యధిక(7) సార్లు 50+ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. అతడి తర్వాత స్థానంలో సామ్ కరన్(4), రబాడ, షమీ, బార్ట్‌లెట్(3) ఉన్నారు.
PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో LSG బ్యాటర్లు చెలరేగారు. జోష్ ఇంగ్లిస్ (72), ఆయుష్ బదోని (43) రాణించారు. చివర్లో సమద్ 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో LSG నిర్ణీత 20 ఓవర్లలో 196/6 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. PBKS 197 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తుందా? కామెంట్ చేయండి.
IPL 2026లో PBKSతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లిస్ విధ్వంసంతో LSG 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇంగ్లిస్, అబ్దుల్ సమద్ ఉన్నారు.
TG: టీజీ20 క్రికెట్ లీగ్‌కు సంబంధించి హైదరాబాద్ జట్టును రూ. 7.50 కోట్లకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. రంగారెడ్డి జట్టును రూ. 7.20కోట్లకు బూరుగు ఇన్ ఫ్రా, ప్రణవ్ కంపెనీలు, వరంగల్ టీంను రూ. 6.55 కోట్లకు బైన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెదక్ జట్టును రూ.6.33 కోట్లకు భృందా ఇన్ ఫ్రా దక్కించుకున్నాయి.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తనకు విలువైన సలహాలు ఇచ్చాడని LSG బ్యాటర్ ముకుల్ చౌదరీ వెల్లడించాడు. కేవలం సిక్సర్లు బాదడం గొప్ప కాదని, ఒత్తిడిలో మ్యాచ్‌లు ఫినిష్ చేయడమే అసలైన నైపుణ్యమని కోహ్లి చెప్పాడని తెలిపాడు. ఒత్తిడిని జయించి ఇన్నింగ్స్ మలిచితేనే గొప్ప ఆటగాడిగా మారుతారని, మ్యాచ్ ఫినిషింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని కోహ్లి సూచించినట్లు పేర్కొన్నాడు.
పంజాబ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు LSG కీలక ఆటగాడు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. ఈ సీజన్‌లో 563 పరుగులతో లక్నో టాప్ స్కోరర్‌గా నిలిచిన మార్ష్ తుది జట్టులో లేడని ESPNcricinfo తెలిపింది. లక్నో ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పంజాబ్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం.
IPL 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో LSGతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో PBKS టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, లక్నో 8 పాయింట్లతో ఆఖరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్ చూస్తోంది.
తొలి ఏడు మ్యాచుల్లో ఆరు విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. LSGతో చివరి మ్యాచ్‌కు ముందు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ..KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం తమ జట్టు దూకుడును దెబ్బతీసిందని అన్నాడు. చివరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశాడు.
కోల్‌కతా మ్యాచ్ అనంతరం హోటల్ వద్ద తన కోసం నిరీక్షించిన ఒక చిన్నారిని గమనించకుండా వెళ్లడంతో ఆమె ఎమోషనల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ… గందరగోళం వల్ల చూడలేకపోయానని, తన చర్యకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. వచ్చేసారి కోల్‌కతాకు వచ్చినప్పుడు ఆ చిన్నారిని వ్యక్తిగతంగా కలుస్తానని రోహిత్ వాగ్దానం చేశాడు.
IPL 2026లో PBKS అరుదైన రికార్డు సృష్టించింది. లీగ్ చరిత్రలోని 19 సీజన్లలో ఈ జట్టు తరఫున 25కు పైగా ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ ప్రారంభించిన ఏకైక ఓపెనింగ్ జోడీగా ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ నిలిచారు. అంతేకాకుండా, గత రెండు సీజన్లలో నిలకడగా ఒకే ఓపెనింగ్ జోడీని ఉపయోగించిన ఏకైక జట్టుగా కూడా PBKS సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. రెజ్లింగ్ సమాఖ్య ఎంపిక విధానం వివక్షపూరితంగా ఉందని తెలిపింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌ను వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. SAI, IOA నుంచి ఇద్దరు స్వతంత్ర పరిశీలకులు హాజరవ్వాలని పేర్కొంది.
IPL-26లో ప్లే ఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించిన CSKకు స్లో ఓవర్ రేట్ రూపంలో మరో షాక్ తగిలింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో రెండోసారి నియమాలు ఉల్లంఘించినందుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.24 లక్షల జరిమానా పడింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన జట్టు సభ్యులందరికీ 25 శాతం మ్యాచ్ ఫీజును ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫైన్‌గా విధించింది.
క్రికెట్‌లో పలు నిబంధనలను మార్చేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టెస్టు మ్యాచ్ మధ్యలో గులాబీ బంతిని మార్చాలని, అలాగే టీ20 ఇన్నింగ్స్ బ్రేక్ సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ కీలక మార్పులపై మే 30న జరిగే ఐసీసీ సమావేశంలో చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ ఆటలో మరిన్ని మార్పులకు దారితీయనున్నాయి.