• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

IPL 2026: క్లాసెన్ విధ్వంసం

IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో క్లాసెన్‌కు ఇది 6వ అర్ధశతకం. ఇషాన్ రాణించడంతో సన్‌రైజర్స్ జట్టు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగులతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

May 22, 2026 / 09:01 PM IST

SRH vs RCB: ఒకే ఓవర్‌లో 27 రన్స్‌

ఉప్పల్ వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH బ్యాటర్లు ఒకే ఓవర్‌లో 27 రన్స్ రాబట్టారు. 13వ ఓవర్‌లో క్లాసెన్ 3 సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. ఇవి కాక రెండు సింగిల్స్, ఎక్స్‌ట్రాల రూపంలో 3 వైడ్‌లు వచ్చాయి. ప్రస్తుతం 16 ఓవర్లకు SRH స్కోర్ 209/2గా ఉంది. క్లాసెన్ (51*), ఇషాన్ కిషన్ (65*) క్రీజులో ఉన్నారు.

May 22, 2026 / 09:01 PM IST

IPL 2026: RCBపై చెలరేగిన అభిషేక్ శర్మ

IPL 2026లో RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ సీజన్‌లో ఇది అతనికి 4వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి, 8 ఓవర్లలో 96 పరుగులతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.

May 22, 2026 / 08:19 PM IST

IPL 2026: పవర్‌ప్లేలో చెలరేగిన SRH

ఉప్పల్‌లో SRH మరోసారి పవర్‌ప్లేలో చెలరేగింది. తొలి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. రసిఖ్ సలాం వేసిన అద్భుతమైన బంతికి హెడ్ బౌల్డ్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్ క్యాచ్ జారవిడచడంతో అభిషేక్ శర్మకు లైఫ్‌లైన్ లభించింది. మ్యాచ్‌పై పట్టు కోసం RCB వికెట్లు అత్యవసరం కాగా..భారీ స్కోరు సాధించడమే లక్ష్యంగా SRH దూసుకెళ్తోంది.

May 22, 2026 / 08:07 PM IST

CSK మారాలి: రవిచంద్రన్ అశ్విన్

IPL ప్రమాణాలు పెరగడంతో CSK, MIల హవా తగ్గిందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 2026 సీజన్‌లో CSK గ్రూప్ స్టేజ్‌కే పరిమితమవడంతో..ఇకనైనా జట్టు నాణ్యమైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టాలని సూచించాడు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు చెపాక్ పిచ్ సూట్ కావడం లేదని, ధోని హయాం నాటి వ్యూహాలు ఇప్పుడు పనికిరావని, అన్ని విభాగాలను సమతూకం చేసుకోవాలని తెలిపాడు

May 22, 2026 / 07:42 PM IST

IPLకు విజయ్ శంకర్ రిటైర్మెంట్

CSK మాజీ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, అభిమానులు, భారత జట్టుతో పాటు తాను ఆడిన SRH, GT, DC, CSK ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలిపాడు. 2014లో CSK తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఆయన, గత సీజన్లో మళ్లీ అదే జట్టుకు వచ్చాడు. ఈసారి వేలంలో ఆయనను ఎవరు కొనుగోలు చేయలేదు.

May 22, 2026 / 07:23 PM IST

SRH vs RCB: ‘మ్యాచ్ ముగిశాక స్టేడియం వదిలి వెళ్లొద్దు’

IPL 2026లో SRH అభిమానులకు క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సీజన్‌లో తమకు లభించిన ఆదరణకు గానూ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలని SRH యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు RCBతో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనుంది. మ్యాచ్ అనంతరం ప్లేయర్లు మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసే ‘One Last Lap Ceremony’ నిర్వహించనున్నారు.

May 22, 2026 / 07:21 PM IST

SRH Vs RCB: తుది జట్లు ఇవే

RCB: విరాట్ కోహ్లి, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ (c), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ (WK), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్ SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్ (c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

May 22, 2026 / 07:10 PM IST

BREAKING: టాస్ గెలిచిన SRH

IPL 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాస్ గెలిచింది. కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హెడ్-టు-హెడ్‌లో హైదరాబాద్ 14-12తో ముందంజలో ఉన్నా.. వరుసగా రెండు సీజన్లలో 70 శాతానికి పైగా విజయాలు సాధించిన ఏకైక జట్టుగా RCB రికార్డు సృష్టించింది.

May 22, 2026 / 07:01 PM IST

మహిళల క్రికెట్ విస్తరణకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్

గత దశాబ్దంలో మహిళల క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2025 మహిళల ప్రపంచ కప్‌కు లభించిన అపూర్వ వీక్షకాదరణ, రికార్డు స్థాయి ప్రైజ్ మనీ రూ.3.88 మిలియన్లు దీనికి నిదర్శనం. ఐసీసీ ఛైర్మన్ జై షా నేతృత్వంలో మహిళల క్రికెట్ విస్తరణకు కీలక చర్యలు చేపట్టాడు. ఇందులో భాగంగా నవంబర్ 2026లో 10 జట్లతో ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ని నిర్వహించనున్నారు.

May 22, 2026 / 05:50 PM IST

క్రికెట్ కామెంటరీపై సంచలన వ్యాఖ్యలు

క్రికెట్ కామెంటరీలో కఠినమైన నియమాలు, నియంత్రణలపై భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లైవ్ మ్యాచ్‌ల్లో కామెంట్లు చేసే మాజీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉండదని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్ బోర్డులు, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు విధించే నిబంధనలకు లోబడే మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

May 22, 2026 / 05:09 PM IST

బీహార్‌కు సొంత IPL జట్టు ఉండాలి: అనిల్ అగర్వాల్

IPLలో బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌ల నేపథ్యంలో, వేదాంత గ్రూప్ బిలియనీర్ అనిల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”చెన్నై, ముంబై తరహాలోనే బీహార్‌కు కూడా సొంత ఐపీఎల్ జట్టు ఉండాలి” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులు బిహార్ సొంత జట్టులో ఆడితే అది ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్‌గా ఎదుగుతుందన్నారు.

May 22, 2026 / 04:38 PM IST

ఉప్పల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు..!

IPL 2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా RCB vs SRH మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ.. వర్షం పడే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్ గ్యారెంటీ. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.

May 22, 2026 / 03:20 PM IST

SRH vs RCB: మ్యాచ్‌కు వర్షం ముప్పు..!

IPL 2026లో భాగంగా ఉప్పల్‌ వేదికగా RCB, SRH మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కానీ.. వర్షం పడే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ వరుణుడు కరుణిస్తే అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్ గ్యారెంటీ. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.

May 22, 2026 / 03:20 PM IST

SRH టాప్-2లో ఉండాలంటే..?

ఐపీఎల్-2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన SRH.. ఇవాళ టేబుల్ టాపర్ RCBతో తలపడనుంది. అయితే సన్‌రైజర్స్ టాప్-2లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయం తప్పనిసరి. మొదట బ్యాటింగ్ చేస్తే RCBపై 83-89 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్‌కు దిగితే ప్రత్యర్థి లక్ష్యాన్ని 11 ఓవర్లలోపే ముగించాలి. ఈ పోరులో నెట్ రన్ రేట్ కీలకం కానుంది.

May 22, 2026 / 01:52 PM IST