• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (127) సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో వైభవ్ ఓ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారి కెప్టెన్ బాధ్యతలు అందుకున్న ఈ యువ సంచలనం.. యూత్ వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడైన అండర్-19 కెప్టెన్‌గా నిలిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఈ ఫీట్ అందుకున్నాడు.

January 7, 2026 / 05:52 PM IST

IND vs SA: సఫారీల ముందు భారీ లక్ష్యం

దక్షిణాఫ్రికా అండర్-19 తో జరుగుతున్న మూడో యూత్ వన్డేలో యువ భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశిచింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (127) విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆరోన్ జార్జి (118) కూడా సెంచరీ సాధించాడు. దీంతో భారత్ జట్టు 50 ఓవర్లలో 393/7 పరుగులు చేసింది.

January 7, 2026 / 05:37 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోటీపడే టెన్నిస్ ప్లేయర్ల ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. టోర్నీ మొత్తం 16 శాతం పెంచి ప్రైజ్‌మనీ రూ.675 కోట్లుగా నిర్ణయించారు. సింగిల్స్ విజేతలకు రూ.25.15 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే మెయిన్ డ్రాలో పాల్గొనే ఆటగాళ్ల ప్రోత్సాహకాలను 10% పెంచారు. ఈ మెగా టోర్నీ జనవరి 18 నుంచి ప్రారంభం కానుంది.

January 7, 2026 / 04:35 PM IST

భవిష్యత్‌లో టెస్టుల్లో జైస్వాల్‌దే హవా: మార్క్ వా

టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసీస్ మాజీ ప్లేయర్ మార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి తరంలో జైస్వాల్ టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు. అతడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. అయితే, మార్క్ అభిప్రాయంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఏకీభవించలేదు. భవిష్యత్తులో హ్యారీ బ్రూక్ హవా కొనసాగుతుందని మైఖేల్ అంచనా వేశాడు.

January 7, 2026 / 03:33 PM IST

ఐసీసీ మా అభ్యర్థనను స్వీకరించింది: BCB

భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, తాము భారత్‌లో ఆడబోమని, తమ మ్యాచ్‌లను మరో చోటుకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. తాజాగా దీనిపై బీసీబీ స్పందించింది. తన ప్రతిపాదనలు ICCకి అందాయని చెప్తోంది. BCBతో కలిసి పనిచేసేందుకు ICC సానుకూలంగా స్పందించిందని బంగ్లా క్రికెట్ బోర్డ్ తెలిపింది.

January 7, 2026 / 03:01 PM IST

వారు తొలగించలేదు.. నేనే తప్పుకున్నా: రిధిమా

ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు (BPL) ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న భారత్‌కు చెందిన రిధిమా పాఠక్ హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకుంది. అయితే, ప్యానల్ నుంచి తనను ఎవరూ తొలగించలేదని, తానే స్వచ్ఛందంగా తప్పుకున్నానని రిధిమా పాఠక్‌ SMలో వెల్లడించింది.

January 7, 2026 / 02:50 PM IST

యాషెస్: బెథెల్ వీరోచిత పోరాటం

యాషెస్ సిరీస్ చివరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుత శతకం చేసి.. 142 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

January 7, 2026 / 01:38 PM IST

సచిన్ ఇంట్లో పెళ్లి సందడి!

క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్‌తో అర్జున్‌కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. తాజాగా, వీరి వివాహ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మార్చి 5న ముంబైలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

January 7, 2026 / 01:34 PM IST

పరుగుల వరద పారిస్తున్నా తప్పని నిరాశ!

విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించాడు. అయినప్పటికీ, అతడికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. దీనిపై పడిక్కల్ స్పందిస్తూ.. జట్టులో చోటు దక్కకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించడం అంత సులభం కాదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించాడు.

January 7, 2026 / 12:45 PM IST

రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు దక్కాలంటే ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలని అతడు అన్నాడు. జట్టులో ఆ రాష్ట్రాల ఆటగాళ్లకు మాత్రమే సుస్థిర స్థానం ఉంటుందని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం భారత జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం గమనార్హం.

January 7, 2026 / 11:57 AM IST

ఆంధ్ర క్రికెట్ జట్టుకు మెంటార్‌గా క్రికెట్ దిగ్గజం

మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌ను ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు మెంటార్‌గా నియమించనున్నట్లు ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అధికారికంగా ప్రకటించారు. క్రికెట్‌లో ఆమెకు ఉన్న సుదీర్ఘ అనుభవం ఆంధ్ర జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవలే విశాఖ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.

January 7, 2026 / 11:38 AM IST

ఇంగ్లండ్ దూకుడు.. జాకబ్ బెథెల్ సెంచరీ

యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 384 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 567 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ధాటిగా బదులిస్తోంది. యువ సంచలనం జాకబ్ బెథెల్ సెంచరీ పూర్తి చేసుకుని 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ENG 219/4 పరుగులు చేసి, 36 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

January 7, 2026 / 11:00 AM IST

టీ20 ప్రపంచకప్‌కు కివీస్ జట్టు ప్రకటన

భారత్ పర్యటనకు ముందే న్యూజిలాండ్ తన టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. సారథిగా మిచెల్ శాంట్నర్ జట్టును నడిపించనున్నాడు. జట్టులో అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిచెల్, ఆడమ్ మిల్నే, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్, ఇష్ సోధి సభ్యులుగా ఉన్నారు, అలాగే జెమీసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.

January 7, 2026 / 08:54 AM IST

యాషెస్: ఆస్ట్రేలియా 567 ఆలౌట్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటైంది. దీంతో 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. స్మిత్(138), హెడ్(163) సెంచరీలు చేయగా, వెబ్‌స్టార్ 71* పరుగులతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 33/1. 

January 7, 2026 / 06:25 AM IST

మలేషియా ఓపెన్: పారిస్ విజేతకు ఆయుష్ శెట్టి షాక్

మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో ముందంజ వేశాడు. సింగపూర్‌కు చెందిన జియా హోంగ్‌ జాసన్ టెహ్‌పై 21-16, 15-21, 21-14 తేడాతో అద్భుత విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ జి జియాకు షాకిస్తూ.. 21-12, 21-17 తేడాతో విజయం సాధించాడు.

January 7, 2026 / 06:08 AM IST