భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పరుగుల వరద పారింది. రెండు జట్లు కలిసి ఏకంగా 499 పరుగులు సాధించాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు 2016 WCలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ (459 పరుగులు) పేరిట ఉండేది. అయితే, ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలోనే జరగటం గమనార్హం.