ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 198 పరుగులకే ఆలౌటైంది. జెమిమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, షఫాలీ వర్మ (35), కాశ్వీ గౌతమ్ (34) పర్వాలేదనిపించారు. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి (4), హర్మన్‌ప్రీత్ (19), దీప్తి (7) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2 వికెట్లు పడగొట్టారు.