VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో బాగంగా కొత్తవలస పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎస్సై ఎన్. జోగారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పట్టణ పరిధిలో ఉన్న పలు పాఠశాల విద్యార్థులకు పోలీసు చట్టాలపై కూలంకుషంగా వివరించారు. అలాగే, స్టేషన్లో ఉన్న రికార్డులు, ఎఫ్ఐఆర్, రిసెప్షన్ విధులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ విధులపై వివరించారు.