వనపర్తి కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం గోనూరు వెంకటయ్య తల్లిదండ్రులు గోనూరు బాలమ్మ రామచంద్రయ్యల జ్ఞాపకార్థం బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్సు షెల్టర్‌ను ఈరోజు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డిలు లాంఛరంగా ప్రారంభించనున్నారని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు.