ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, నటుడు అల్లు శిరీష్, నయనిక వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవమూ ఇవాళే కావడం విశేషం.