మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో తాను ఒక ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నట్లు బండ్ల గణేష్ వెల్లడించాడు. తన వ్యాపార బాధ్యతల వల్ల ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి సమయం లేదని, అందుకే నటనకు కాస్త దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అయితే, మెగాస్టార్ సినిమాలో పాత్ర రావడంతో, దాన్ని వదులుకోలేక నటిస్తున్నట్లు బండ్ల పేర్కొన్నాడు.