కోనసీమ: మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరయ్యాయని స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించే రాతి శిలలను మార్టూరులో అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి ఆలయాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే ఆలయ అధికారులకు సూచించారు.