విశాఖలోని జగదాంబ జంక్షన్ వద్ద బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ లేని సమయంలో ఓ ఆగంతకుడు బస్సు నడిపాడు. బస్సుతో రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.