PDPL: గోదావరిఖనిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతసామరస్యం వెల్లి విరిసింది. BRS రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లింలు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా మజ్జిగ పాకెట్లు అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు. వారి మతసామరస్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.