PDPL: రామగిరి మండలం పన్నూరు సెంటినరీ కాలనీకి చెందిన గూడెల్లి సృజన యూపీఎస్సీ-2025లో 55 ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. సృజన తండ్రి రాజేశం సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కాగా, సృజన గతంలో గ్రూప్ -1లో 35 ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఆమె విజయంపై పలువురు అభినందించారు.