KNR: జిల్లాలో వేసవికాలం నేపథ్యంలో గ్రామాలు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్షా సమావేశం నిర్వహించారు.