ప్రకాశం: కందుకూరులో LIC అధికారులను బురిడీ కొట్టించి రూ. 9 లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ SI శివనాగరాజు శనివారం తెలిపారు. LIC ఏజంట్‌గా శ్రీనివాసులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి 9 లక్షలు కాజేసిన వ్యవహారాన్ని ఆడిట్ అధికారులు గుర్తించారు. దీంతో గతంలో కేసు నమోదైంది. ఆకేసుకు సంబంధించి శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు SI వివరించారు.