NLR: కందుకూరు TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్ను ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ ఆవిష్కరించారు. సమాజానికి ముప్పుగా మారిన మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని ఆయన కోరారు. ఈనెల 7న యాంటీ డ్రగ్స్ ప్రచారం కోసం జన చైతన్య జీపు యాత్ర కందుకూరు చేరుకుంటుందని ఫోరం కన్వీనర్ వినోద్ తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.