NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లెడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను పలు సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేశారు. దీంతో శనివారం నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల రీ షెడ్యూల్ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.