KMM: తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ జాతర మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ దేవతల జాతరను పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి అనిపెద్ది సుబ్రహ్మణ్య శాస్త్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.